కుర్చీ మడతపెట్టిన నారాలోకేష్.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-02-17 11:19:42.0  )
కుర్చీ మడతపెట్టిన నారాలోకేష్.. అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ పాలిటిక్స్ హీటెక్కాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో నిర్వహించిన ‘శంఖారావం’ సభలో మీరు చొక్కాలు మడతపెడితే.. మేము మీ కుర్చీ మడత పెట్టి సీటు లేకుండా చేస్తామని నారాలోకేష్ జగన్ ను ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న కుర్చీని మడతపెట్టి మరి చూయించారు. దీంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లింది. ఇదే అంశంపై ట్విట్టర్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ‘నాలుక మడతపడకుండా చూసుకో బాబూ లోకేష్.. కుర్చీ సంగతి తర్వాత!’ ‘ఇక్కడ ఉన్నది ‘సింహాసనం’ కుర్చీ కాదు మడతపెట్టాడానికి!’ అంటూ వరుస ట్వీట్లు చేశారు.

Advertisement

Next Story