Breaking: వాళ్ళ ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి.. నారా లోకేష్

by Indraja |
Breaking: వాళ్ళ ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి.. నారా లోకేష్
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తు కలుపుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల అధినేతలు సీట్ల కేటాయింపు అంశంపై చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇక ఆ నిర్ణయం ప్రకారం మొదటి లిస్ట్ ను నిన్న విడుదల కాగా.. 118 మంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం.

అయితే విడుదలైన మొదటి లిస్ట్ ప్రకారం 94 సీట్లు టీడీపీ తీసుకోగా 24 సీట్లను జనసేనకు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని మాధ్యమాలు టీడీపీ జనసేనను ఎద్దేవ చేస్తూ.. పావుషేరు పాలిట్రిక్స్ అని ప్రచారం చేయసాగాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ ఫోటోని షేర్ చేస్తూ.. ఆ ఫోటో కి బ్లూ మీడియా ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి.. బై బై జగన్ అనే కాప్షన్ ట్యాగ్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఆర్తనాదాలు మామూలుగా లేవని ఒకరు.. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ న్ని ట్రోల్ చేస్తున్నావని మరొకరు ఇలా నెటిజన్స్ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.





Advertisement

Next Story

Most Viewed