అప్పుడే ఏడాది గడిచిందంటే నమ్మలేకున్నా.. నారా లోకేష్ ఎమోషనల్

by Indraja |
అప్పుడే ఏడాది గడిచిందంటే నమ్మలేకున్నా.. నారా లోకేష్ ఎమోషనల్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఈ రోజు నందమూరి తారకరత్న వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో తారక్ మనల్ని వదిలి వెళ్లి అప్పుడే సంవత్సరం అయ్యిందంటే నమ్మలేకున్నాను.. మధురమైన జ్ఞాపకాలతో నువ్వు మా ఆలోచనల్లో ఇప్పటికీ బ్రతికే ఉన్నావు.. కానీ నిన్ను మిస్ అవుతున్నాను నా ప్రియమైన సోదర అని ఎమోషనల్ గా ట్యాగ్ చేస్తూ తారకరత్న ఫోటోను పోస్ట్ చేశారు.

ఇక గత ఏడాది కుప్పంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా స్పృహతప్పి కుప్పకూలిపోయారు. దీనితో ఆయన్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నందమూరి వారసుడిగా తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో రంగ ప్రవేశం చేసి తెలుగు ప్రజలకు పరిచయం అయ్యారు.

ఒక ఏడాదిలోనే తొమ్మిది సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. అయితే సినీ నేపథ్యంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న సినీ పరిశ్రమలో రాణించలేక పోయారు. ఇక మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అలేఖ్య రెడ్డి అనే మహిళను ప్రేమిచి పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ పెళ్లిని తారకరత్న కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

దీనితో కుటుంబానికి దూరమైన తారకరత్న భార్యతో కలిసి విడిగా జీవించసాగరు. తారకరత్న దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా గత ఏడాది టీడీపీ పార్టీ ప్రచారంలో భాగంగా నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.

Advertisement

Next Story