- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా లోకేశ్‌ది బ్రేకుల యాత్ర : హోంశాఖ మంత్రి తానేటి వనిత
దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రపై హోంశాఖ మంత్రి తానేటి వనిత విమర్శల వర్షం గుప్పించారు. లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రను వైసీపీ అడ్డుకుంటుంది అంటున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఆయన పాదయాత్రను ఎవరూ అడ్డుకోవడం లేదని చెప్పుకొచ్చారు. లోకేశ్ పాదయాత్ర అదొక బ్రేకుల యాత్ర అని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే నారా లోకేశ్ పనిగా మారిందని విమర్శించారు. మంచిని మంచి అని చెప్పలేని దీనస్థితిలోకి ప్రతిపక్షం వెళ్లిపోయిందని విమర్శలు చేశారు. అంతర్వేదిలో జరిగిన రథం దగ్థం ఘటనలో భక్తులు, ప్రజలు మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే మరో రథం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తయారు చేయించి ఇచ్చారని గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన నుంచి వైసీపీలోకి రావడం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చారు. జగనన్న ప్రభుత్వంలో పాలన అంతా పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.