- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయం కావాలి: Nara Lokesh
దిశ, ఏపీ బ్యూరో : అమరావతి రాజధాని రైతులు చేపట్టిన మలివిడత పాదయాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమరావతి నుంచి అరసవల్లి వరకు ప్రారంభించిన మహాపాదయాత్రను దిగ్విజయం కావాలని లోకేశ్ ఆకాంక్షించారు. అమరావతిదే అంతిమ విజయం అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అంతేకాదు అమరావతి ఉద్యమం వెయ్యిరోజులకు చేరుకోవడంతో పోరాటంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ లోకేశ్ ఉద్యమాభి వందనాలు తెలిపారు. 'రాజధానిని కాపాడుకుని, రాష్ట్రాన్ని రక్షించుకుందామనే లక్ష్యంతో మొదలైన అమరావతి ఉద్యమం మహోద్యమమై వైసీపీ విద్వేష పాలకులకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఓర్పు, సహనంతో వెయ్యి రోజులుగా పోరాటం కొనసాగిస్తున్న అమరావతి రైతులు, యువత, మహిళలకు ఉద్యమాభివందనాలు.
నాడు మీ త్యాగంతో అమరావతికి పునాదులు పడ్డాయి. నేడు మీ పోరాటంతో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి చిరస్థాయిగా నిలుస్తుంది అని లోకేశ్ కొనియాడారు. ఫ్యాక్షన్ పాలనలో నిర్బంధాలు, అక్రమకేసులు, దాడులు, విద్వేష విషప్రచారాల్ని ఎదురొడ్డి అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర చేసిన మీ ధైర్యానికి నా సలామ్. అఖిల పక్షాల అండతో, అన్ని ప్రాంతాల ప్రజల ఆశీస్సులతో అమరావతి నుంచి అరసవల్లి వరకూ ఆరంభించిన మహాపాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అమరావతిదే అంతిమ విజయం. జై ఆంధ్రప్రదేశ్.. జైజై అమరావతి అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి : శాసన సభ్యుడి గా కొడాలి నాని ఎదిగారు అంటే ఎన్టీఆర్ పెట్టిన భిక్ష : టీడీపీ నేత అనిత