- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking News: బీసీలపై నారా లోకేశ్ వరాల జల్లు..
దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జోరందుకుంది. ప్రచారకార్యక్రమాలతో, భహిరంగ సభలతో టీడీపీ అధినేత కుటుంబం బిజీగా మారింది. ఓ వైపు చంద్రబాబు, మరోవైపు అయన తనయుడు నారా లోకేష్, ఇంకోవైపు సతీమణి భువనేశ్వరి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు. ఇక ప్రచారంలో భాగంగా రోజు హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
ఈ సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టరాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే 300 మంది బీసీలను ఏకంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బీసీలకు రావాల్సిన రూ/ 25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. అయితే ఈ బీసీలకు ఈ కష్టాలన్నీ కేవలం ఇక కొన్ని రోజులే అని.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తుందని హామీ ఇచ్చారు. అలానే బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఆదరణ పథకం కింద రూ.5 వేల కోట్లు ఖర్చుపెట్టి పనిముట్లు అందజేస్తాం అని తెలిపారు.
Read More..
Breaking: 45 ఏళ్లు దాటిన మహిళల అకౌంట్లలోకి భారీగా డబ్బులు