YS రాజశేఖర్ రెడ్డికి సమస్కరించి నివాళులర్పించిన లోకేష్ (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-05-15 12:23:35.0  )
YS రాజశేఖర్ రెడ్డికి సమస్కరించి నివాళులర్పించిన లోకేష్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యకర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రస్తుతం శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డికి లోకేష్ నివాళులర్పించారు. అనంతరం వెలగాము వద్ద కొత్త రామాపురం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. గ్రామస్తులు లోకేష్‌కు సమస్యలను విన్నవించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప రైతుల సమస్యలు పట్టవని విమర్శించారు. సీఎం ముఖం చూసి రాష్ట్రంలో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిద్దాపురం లిఫ్ట్‌కు అనుబంధంగా పిల్లకాల్వల పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు విధానాన్ని పునఃప్రారంభించి, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలుచేస్తామన్నారు. పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story