Breaking News: శ్రీవారి సేవలో నారా కుటుంబం

by Indraja |
Breaking News: శ్రీవారి సేవలో నారా కుటుంబం
X

దిశ తిరుమల: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపి బ్రేక్ దర్శన సమయంలో నారా లోకేష్ తల్లి నారా భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, కొడుకు దేవాన్ష్ లతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదానం సత్రంకు నారా కుటుంబం చేరుకుంది.



ఆ తరువాత దేవాన్ష్ పుట్టినరోజు పురస్కరించుకుని భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. నారా లోకేష్ కుటుంబం వెంట టిడిపి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే మనవడు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి మాత్రమే కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు రాకపోవడం గమనార్హం.





Advertisement

Next Story