Breaking: తమ్ముడు భూమిస్తే జగన్ నోటీస్ ఇస్తాడు..నారా చంద్రబాబు నాయుడు

by Indraja |   ( Updated:2024-02-17 13:59:41.0  )
Breaking: తమ్ముడు భూమిస్తే జగన్ నోటీస్ ఇస్తాడు..నారా చంద్రబాబు నాయుడు
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు పరుచూరులో నిర్వహించిన రా కదిలిరా భహిరంగ సభలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు విచ్చేసిన జనసేన సైనికులను, టీడీపీ కార్యకర్తలను చూస్తుంటే గెలుపు టీడీపీదే అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు.

అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడాని ప్రజలు అందరూ కలిసి వచ్చారని పేర్కొన్నారు. జగన్ పని, వైసీపీ పని అయిపోయిందని.. భూస్థాపితం కానుందని వెల్లడించారు. ఇక ఎక్కడికక్కడ పరదాలు కట్టుకుని తిరగడం కాదని.. పరుచూరు సమావేశానికి ఎంత మంది ప్రజలు స్వచందంగా వచ్చారో ధైర్యం ఉంటె టీవీ ఆన్ చేసి చూడమన్నారు.

ధైర్యం చాలకుంటే తమ తమ్ముళ్లు ఇక్కడే ఉన్నారని.. యూట్యూబ్ లింక్ పంపిస్తారని.. ఒక్కసారి చూస్తే ఇక జగన్ కు రాత్రులు నిద్ర రాదనీ ఎద్దేవ చేశారు. ఇక జగన్ డబ్బు సంచులకు, దౌర్జన్యాలకు, అధికార దుర్వినియోగానికి, అక్రమ కేసులకు ఇవే చివరి రోజులని పేర్కొన్నారు. ప్రజల్లో జగన్ పాలనపై కసి, తిరుగుబాటు కనబడుతోందని వెల్లడించారు.

పొయ్యే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపొయ్యేది మీరేనని..జర హుషారుగా ఉండమని పోలీసులకు సూచించారు. అలానే కాకీ బట్టలు వేసుకున్న పోలీసులు చట్టాన్ని గౌరవిస్తూ మళ్ళీ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించాల్సిందిగా కోరారు. తాము మీటింగ్ పెడితే అడ్దుకోవాలని చూసిన జగన్ కి ఫ్యాంటు తడిచిపోయిందని ఎద్దేవ చేశారు.

ఇక మీటింగ్ కోసం రైతు స్వచ్చందంగా భూమి ఇస్తే.. మీటింగ్ జరగకుండా ఆపేందుకు ఆ భూమి ఇచ్చిన తముడికి నోటీసులు ఇవ్వాల్సిందిగా పోలీసులకు జగన్ ఫోన్ చేసి చెప్పారని.. అది జగన్ అసలు రంగు అని ఆరోపించారు. ఇక ఆ రంగు వదులుతుందని జగన్ ని హెచ్చరించారు. మీటింగ్ ఆపేందుకు జగన్ ప్రయత్నిస్తే.. తాము చట్ట ప్రకారం పోతున్నామని..దిక్కున్న చోట చెప్పుకోమని తమ నాయకులు చెప్పారని పేర్కొన్నారు.

Read More..

ఈ రెండు సీట్లు ఎవరివో.. పట్టుబడుతున్న జనసేన, బీజేపీ

Advertisement

Next Story