- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నిజం గెలవాలి’లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న-Nara Bhuvaneswari
దిశ,ఏలూరు:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వార్త తెలిసి మృతి చెందిన కుటుంబాలను ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మంగళవారం పరామర్శించారు.చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.చంద్రబాబు ను అక్రమంగా అరెస్టు చేసి సెంట్రల్ జైలుకు పంపించిన సమయంలో భావోద్వేగంతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించడానికి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టిన భువనేశ్వరి కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట, కన్నాయిగూడెం, బయ్యన గూడెం గ్రామాలకు చెందిన చండ్ర చిన్న కన్నయ్య వెంకటలక్ష్మి (కన్నాయిగూడెం) , మార్గాని, వెంకటేశ్వరరావు, (బయ్యనగూడెం) , కుటుంబ సభ్యులను పరామర్శించి హామీ పత్రాన్ని అందజేశారు బాధిత కుటుంబాలకు 3 లక్షల చొప్పున మూడు చెక్కులను అందజేశారు.
తొలిసారి వచ్చిన భువనేశ్వరికి ఈ మూడు గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలే మన కుటుంబ సభ్యులు అని నాన్నగారు ఎన్టీఆర్ ఎప్పుడు చెబుతుండే వారని గుర్తు చేసుకున్నారు. ఆయన స్ఫూర్తితోనే చంద్రబాబు ముందుకు నడిచారని , తమ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా మాకు అండగా నిలిచారని అన్నారు.అక్రమంగా అరెస్టు చేయడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం తనను కలచి వేసిందని కుటుంబ పెద్దను పోగొట్టుకొని ఇంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలనని అన్నారు. చంద్రబాబు సూచనలతో కష్టకాలంలో మా వంతు సహాయం చేయాలని ఆలోచనలతో తమ కుటుంబాలను పరామర్శించడానికి వచ్చానని ఆమె అన్నారు.
నిజం గెలవాలి అనే నినాదంతో చేస్తున్న ఈ ప్రయాణంలో చాలా కుటుంబాలను కలిసానని తెలిపారు. దీనిలో భాగంగా బ్యాంకు ద్వారా మీకు ఆర్థిక సహాయం చేశానని, ఎప్పుడు కష్టం వచ్చినా తమ కుటుంబం, పార్టీ అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, గన్ని వీరాంజనేయులు ,మొడియం శ్రీనివాసరావు, గోపాలపురం టిడిపి ఇన్చార్జి మద్దిపాటి వెంకటరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్డి మేఘలాదేవి, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, పోలవరం టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిల అభ్యర్థి చిర్రి బాలరాజు ,బొరగం.శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు పారేపల్లి నరేష్, కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షుడు జేష్ట రామకృష్ణారావు, పరిమి రాంబాబు,పారేపల్లి రామారావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.