Telugu Language Day:తల్లి భాష అనేది పుడుతూనే ప్రతి ఒక్కరికీ దక్కే వారసత్వ సంపద: నారా భువనేశ్వరి-బ్రహ్మణి

by Anjali |
Telugu Language Day:తల్లి భాష అనేది పుడుతూనే ప్రతి ఒక్కరికీ దక్కే వారసత్వ సంపద: నారా భువనేశ్వరి-బ్రహ్మణి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజల వాడుక భాషలోనే రచనలు చేయాలంటూ ఉద్యమించి సాహిత్యాన్నే కాకుండా , ప్రపంచ శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సైతం సామాన్యులకు చేరువ చేసిన భారత ప్రథమ భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి అండ్ కోడలు బ్రహ్మణి సోషల్ మీడియా వేదికన తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి భాష అనేది పుడుతూనే ప్రతి ఒక్కరికీ దక్కే వారసత్వ సంపదలాంటిది. అలా మనకు దక్కిన తెలుగు భాషను గౌరవిద్దాం. గర్వంగా తెలుగులో మాట్లాడుకుందాం’. అని భువనేశ్వరి చెప్పుకురాగా.. కోడలు బ్రహ్మణి.. ‘ఏ దేశమేగినా, ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. మన సంస్కృతిని కాపాడుకోడానికి, ఆత్మీయతను పంచుకోడానికి తెలుగులోనే మాట్లాడుకుందాం. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed