నందిగం సురేష్ బెయిల్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా

by Rani Yarlagadda |   ( Updated:2024-10-25 06:57:48.0  )
నందిగం సురేష్ బెయిల్ పిటిషన్.. విచారణ మళ్లీ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: తుళ్లూరు మండలం వెలగపూడిలో 2020లో జరిగిన మరియమ్మ హత్యకేసులో నిందితుడిగా అరెస్టైన నందిగం సురేష్ (Nandigam Suresh)కు మంగళగిరి కోర్టు.. మరోసారి 14 రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హై కోర్టు (AP High Court)ను ఆశ్రయించగా.. దానిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. తాజాగా.. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టగా.. తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 28వ తేదీకి (సోమవారం) వాయిదా వేసింది.

రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ అనే మహిళ మరణించింది. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఈ కేసు విచారణ ముందుకు కదల్లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న కేసులపై విచారణ ప్రారంభించింది. ఈ క్రమంలో మహిళ హత్యకేసులో 78వ నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు. అంతకుముందే టీడీపీ కార్యాలయంపై దాడికేసులో అరెస్టై.. మధ్యంతర బెయిల్ (Interim Bail) తెచ్చుకున్న నందిగం సురేష్ ను తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ తో అక్టోబర్ 7న అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed