Tarakaratna ఆరోగ్యం విషమించినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..!

by srinivas |   ( Updated:2023-02-19 12:41:48.0  )
Tarakaratna ఆరోగ్యం విషమించినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి ఏం చేశారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి ఆస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యం చేయిస్తున్నట్లు తెలిపారు.


నందమూరి తారకరత్న, అలేఖ్యది ప్రేమ వివాహం. వీరికి ముగ్గురు పిల్లలు. ఒకరు కుమారుడు కాగా ఇద్దరు కుమార్తెలు. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి జీవితంలో తారకరత్న కన్నుమూత పెను విషాదాన్ని నింపింది. తారకరత్న మృతితో అలేఖ్య రెడ్డి ఒంటరయ్యారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్నన్ని రోజులు ఆమె కూడా అక్కడే ఉన్నారు. తారకరత్న ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకున్నారు. చివరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె ఆహారం తీసుకోలేదు. దీంతో ఆమె నీరసించిపోయారు.

కాగా నందమూరి తారకరత్న చికిత్స పొందుతూ కన్నుమూశారు. నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు గుండుపోటు వచ్చింది. దీంతో తారకరత్నను స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగించారు. అయితే 23 రోజులు పాటు మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు తుది శ్వాస విడిచారు. దీంతో తారకరత్న భౌతికకాయాన్ని స్వగ్రహం మోకిలలో ఉంచారు. అభిమానులు సందర్శనార్థం సోమవారం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed