Breaking News: నారా లోకేశ్‌తో తారకరత్న భేటీ

by srinivas |   ( Updated:2023-01-10 12:54:29.0  )
Breaking News: నారా లోకేశ్‌తో తారకరత్న భేటీ
X
  • తాజా రాజకీయ పరిణామాలు, కుటుంబపరమైన అంశాలపై చర్చ

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సినీనటుడు నందమూరి తారకరత్న కలిశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఇరువురు కుటుంబపరమైన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముందుగా తారకరత్న కలిసి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు లోకేశ్‌కు తెలిపారు. అలాగే పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే కుటుంబం తరఫున మద్దతుగా కలిసే అంశంపైనా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తారకరత్న తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. నందమూరి వంశం నుంచి బాలకృష్ణ తర్వాత పార్టీలో అంత యాక్టివ్‌గా ఉంటారు. అలాగే టీడీపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఏ నియోజకవర్గం నుంచిపోటీ చేయాలో అనే అంశంపై త్వరలో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. అయితే తారకరత్న పోటీ చేసే నియోజకవర్గం అంశంపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నారా, నందమూరి కుటుంబాల మధ్య కొంతమంది గ్యాప్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని... కానీ నందమూరి, నారా కుటుంబాలు రెండు కాదని ఒకటేనని తారకరత్న లోకేశ్‌తో అన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story