ఆ పని చంద్రబాబు ఒక్కడే చేయగలడు.. నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
ఆ పని చంద్రబాబు ఒక్కడే చేయగలడు.. నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో ప్రముఖ సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు ఐదేళ్లు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి అభివృద్ధికి ఆమడ దూరంలోకి నెట్టారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమి ఎదుట ఇప్పుడు ఏ శక్తీ నిలవలేదని ధీమా వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్‌కు ఘోర పరాజయం తప్పదని తెలిపారు. ఓటమి భయంతోనే రాళ్ల డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. కాగా, మరోవైపు ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తోన్న విషయం తెలిసిందే. రాయలసీమలో నందమూరి బాలకృష్ణకు ఎక్కువ అభిమానులుండటంతో ఆయన యాత్ర సీమలో పూర్తిగా విజయవంతం అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story