వెలుగులోకి నందమూరి బాలకృష్ణ ఆస్తి వివరాలు.. కొడుకు పేరిట ఎంత ఉందో తెలుసా?

by GSrikanth |
వెలుగులోకి నందమూరి బాలకృష్ణ ఆస్తి వివరాలు.. కొడుకు పేరిట ఎంత ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో రెండుచోట్లా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండటంతో హిందూపురం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం భారీ ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నామినేషన్ డాక్యుమెంట్‌లలో తన ఆస్తి వివరాలును పేర్కొన్నారు. మొత్తం బాలయ్య పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు, కొడుకు మోక్షజ్ఞ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు.. బాలయ్యకు రూ.9.9 కోట్లు, భార్య వసుంధరకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆస్తుల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తండ్రి నందమూరి తారక రామారావు కుమారుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య 2014లో తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019లోనూ గెలిచి సత్తా చాటారు. నందమూరి కుటుంబం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడో సభ్యుడు బాలకృష్ణ కావడం విశేషం.

Advertisement

Next Story