నాన్నకు భారతరత్న ఇవ్వాలి: పద్మభూషణ్‌ రావడంపై తొలిసారి స్పందించిన బాలకృష్ణ

by srinivas |   ( Updated:2025-01-26 14:13:04.0  )
నాన్నకు భారతరత్న ఇవ్వాలి: పద్మభూషణ్‌ రావడంపై తొలిసారి స్పందించిన బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: తన తండ్రి ఎన్‌టీ రామారావు(NT Ramarao)కు భారత రత్న(Bharata Ratna) ఇవ్వాలని తనయుడు నందమూరి బాలకృష్ణ(Nandmuri Balakrishna) అన్నారు. పద్మభూషణ్ అవార్డు(PadmaBhushan Award) వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నందమూరి బాలకృష్ణను కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ పద్మభూషణ్ రావడంపై తొలిసారి స్పందించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలని అభిమానులు, ప్రజలతో పాటు తాను కూడా కోరికుంటున్నట్లు తెలిపారు.

‘‘స్ఫూర్తిదాయకమైన మహానుభావులు చాలా మంది ఉన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కూడా ఆ కోవకు చెందినవారే. ఏపీ, తెలంగాణ ప్రజలే కాదు, తెలుగువారు ఎక్కడున్నా ఎన్టీఆర్‌కు భారత రత్న రావాలని కోరుకుంటున్నారు. సినిమా, హాస్పిటల్ రంగంతోపాటు ఎమ్మెల్యేగా కూడా ప్రజలకు సేవ చేస్తున్నా. నా సేవలను కేంద్రప్రభుత్వం గుర్తించింది. మళ్లీ వెన్నుతట్టి నన్ను ఉత్సాహ పరిచారు. పద్మభూషణ్ రావడం సంతోకరంగా ఉంది. హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటా.’’ అని అని బాలకృష్ణ తెలిపారు.

Next Story

Most Viewed