మరో పథకం పేరు మార్పు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

by srinivas |
మరో పథకం పేరు మార్పు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో పథకం పేరు మారిపోయింది. ‘శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం’ (Saswatha Bhu Hakku Bhu Raksha Pathakam) పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రీ సర్వే ప్రాజెక్టు (AP Re Survey Project)గా ఈ పథకాన్ని మారుస్తూ రెవెన్యూ శాఖ (Revenue Department) ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా గత ప్రభుత్వం ‘శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ys Jagan ) యోచించారు. ఇందులో భాగంగ భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. అయితే ఈ పథకం ఆచరణలోకి వచ్చే సరికి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితులు లబో దిబోమన్నారు. ‘శాశ్వత భూ హక్కు-భూ రక్ష’ పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఆ పథకం పేరుతో చేస్తున్నతప్పులను అప్పటి ప్రతిపక్షం టీడీపీ (TDP) తీవ్రంగా వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ‘శాశ్వత భూ హక్కు-భూ రక్ష’ పథకాన్ని ప్రక్షాళన చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed