జర్నలిస్టుపై దాడి చేయడం దారుణం.. ఇది మీ పాలనకు అంతం.. మెగా బ్రదర్

by Indraja |   ( Updated:2024-03-09 14:18:04.0  )
జర్నలిస్టుపై దాడి చేయడం దారుణం.. ఇది మీ పాలనకు అంతం.. మెగా బ్రదర్
X

దిశ డైనమిక్ బ్యూరో: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వారధి మీడియా. ప్రజా శ్రేయస్సు కోసం ఈ దేశంలోనే కాదు ఈ విశ్వంలో ఏ చోటుకైనా వెళ్లి ఊహకి అవాస్తవానికి మధ్య ఊగిసలాడుతున్న వాస్తవాలని ప్రజలకు తెలియ చేసే బాధ్యతతో కూడిన హక్కు మీడియా ప్రతినిధులకు ఉంది. అయితే ఇటీవల జరిగిన సిద్ధం బహిరంగ సభలో ఓ జర్నలిస్టుపై విచక్షణా రహితంగా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అలా సాటి మనిషి పై దాడి చేయడం తప్పని చెప్పాల్సిన వైసీపీ నేతలతో పాటుగా అధినేత సీఎం జగన్ కూడా ఆ అరాచకాన్ని సమర్ధించడం రాష్ట్రం చేసుకున్న దౌర్బభాగ్యం అంటున్నారు కొందరు ప్రముఖులు.

కొన్ని మిడీయ సంస్థల్ని వైసీపీ భహిష్కరించింది.. అయినా వచ్చిన వాళ్ళు కేక్ తిని వెళ్ళండి అని సీఎం స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనడం విచారం.. వెలివేయడానికి నేను మాట్లాడాను పో అనడానికి మీ బంధువులో.. ఇంట్లో వాళ్ళో కాదు మీడియా. ఎక్కడికైనా వచ్చే అధికారం మీడియాప్రతినిధులకు ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇక తాజాగా ఇదే అంశం పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. మీడియా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అని పేర్కొన్నారు.

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మీడియా వారధిగా ఉందని కొనియాడారు. ఎవరైతే మీడియా ప్రతినిధిని విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారో ఆ వైసీపీ ప్రభుత్వాన్ని, కార్యకర్తల తీరును తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మంచి చేకూర్చే వార్తలను, సమాజానికి నష్టాన్ని కలుగచేసే వ్యక్తుల తాలూకా సమాచారాన్ని, మొదలైన వార్తలను ప్రజాశ్రేయస్సుకోసం మీడియా ప్రసారం చేసే వ్యక్తులు జర్నలిస్టులని.. అది వాళ్ళ వృతి అని పేర్కొన్నారు.

ఒకవేళ ఓ జర్నలిస్ట్ జర్నలిజం పై మీకు కోపం ఉంటె ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని.. అంతేకాని అలా దొరికారు కదా అని తీవ్రంగా కొట్టడం చాల తప్పని.. ఎవరు చేసిన తప్పే అని మండిపడ్డారు. కొన్నిసార్లు ప్రజలు భావోద్వేగాలకు లోనవ్వొచ్చని.. అలాంటప్పుడు ప్రజలను సంయమనం పాటించాలని చెప్పాల్సిన నాయకులు ఇలా అరాచకాలు చెయ్యమని ప్రోత్సహించడం సరైన పద్దతికాదని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed