దాడులు జరిగే అవకాశం.. ఫలితాల వేళ నాగబాబు షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
దాడులు జరిగే అవకాశం.. ఫలితాల వేళ నాగబాబు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. అందరి దృష్టి ఏపీ అసెంబ్లీ రిజల్ట్స్‌పైనే ఉన్నాయి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు..? ముఖ్య నాయకులు గెలుస్తారా? గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు? అనే తెలుగు రాష్ట్రాల్లో చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుస్తారా? అనే దానిపై ఏకంగా బెట్టింగులు సైతం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కూటమి కార్యకర్తలు, నేతలకు పలు సూచనలు చేశారు. వైసీపీ ఓటమి ఖరారు అయిందని.. ఆ విషయం ఆ నేతలకు కూడా తెలిసిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేక కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని.. కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సహనం కోల్పోవద్దని, సంయమనం పాటించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed