- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీ పాలనలో ఏపీ నాశనం..నాగబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికలకు నాలుగు రోజులే ఉండటంతో అన్ని పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా వ్యూహలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు రోడ్‌షోలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున తన కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కొణిదెల నాగబాబు వైసీపీ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఇప్పటికే నాశనం అయిపోయిందని జనసేన నేత నాగబాబు అన్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీని బాగుచేయలేమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, కొత్త పరిశ్రమలు రావాలంటేనే భయపడుతున్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ ఒత్తిడితోనే అమర్‌రాజా సంస్థ హైదరాబాద్‌కు వెళ్లిపోయిందని తెలిపారు. మళ్లి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మత్తు మయం అవుతుందని, యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ పరిశ్రమలు రావాలన్న, మద్యం నిషేధం చేయలన్న అది కూటమి తోనే సాధ్యం అవుతుందని తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే జనసేన పవన్ కళ్యాణ్‌ని భారీ మెజారిటితో గెలిపించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
Read More...
పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్