Nagababu: ప్రభుత్వ పదవిపై మనసులో మాట బయటపెట్టిన నాగబాబు.. ఏమన్నారంటే..?

by Satheesh |   ( Updated:2024-07-21 11:14:21.0  )
Nagababu: ప్రభుత్వ పదవిపై మనసులో మాట బయటపెట్టిన నాగబాబు.. ఏమన్నారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీఏ నేతృత్వంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో పదవిపై జనసేన నేత నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబుకు చంద్రబాబు సర్కార్‌లో కీలక పదవి దక్కుతుందని పొలిటికల్ సర్కిల్స్‌లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి పార్లమెంట్‌ సీటును త్యాగం చేసిన నాగబాబుకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వాబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో నామినేటేడ్ పదవులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నాగబాబు ఐదు లక్షల భీమా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని కుండబద్దలు కొట్టారు.

తనకు ఓపిక, ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం పని చేస్తానని స్పష్టం చేశారు. తన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశయాలను నేరవేర్చడంలో తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తన తమ్ముడు పవన్ కల్యాణ్ అండగా నిలిచాడని ఈ సందర్భంగా నాగబాబు గుర్తు చేసుకున్నాడు. ఇక, చంద్రబాబు, పవన్ మంచి విజనరీ ఉన్న లీడర్స్ అని.. వీరిద్దరి భాగస్వామ్యంతో ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక, అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రజలకు ఏం చేయని జగన్.. కూటమి అధికారంలోకి వచ్చి సరిగ్గా నెలకాకముందే మొరుగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి దారిలోకి తీసుకువస్తామని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story