ఆ రోజు నుంచే అడగటం మానేశా.. పవన్ కల్యాణ్‌పై నాగబాబు భావోద్వేగ పోస్ట్

by GSrikanth |
ఆ రోజు నుంచే అడగటం మానేశా.. పవన్ కల్యాణ్‌పై నాగబాబు భావోద్వేగ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు మధ్య ఏ లెవెల్ బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరచూ ఒకరికి ఒకరు ప్రేమ చూపించుకోకపోయినా.. ఒక సమయం వచ్చినప్పుడు అండగా నిలబడుతుంటారు. తాజాగా.. జనసేన పార్టీ గెలుపు కోసం కూడా నాగబాబు అదే రేంజ్‌లో కష్టపడ్డారు. ఈ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినా కూడా ఏమాత్రం నిరాశకు లోనవకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. తాజాగా.. తెల్లవారితే ఎన్నికలు అనగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. అందులో పవన్ కల్యాణ్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచాడు.

నిన్ను నమ్మని వాళ్ల కోసం కూడా ఎందుకు నిలబడతావ్ అని అడిగితే ‘చెట్టు’ని చూపిస్తాడు. అది నాటిన వాళ్లకి మాత్రమే నీడనిస్తుందా అని...

నీతో నడవని వాళ్ల కోసం కూడా ఎందుకు నిందలు మోస్తావ్ అని అడిగితే 'వర్షాన్ని చూపిస్తాడు తనకి మొక్కని 'రైతు కంటిని తడపుకుండా పంటనే తడపుతుందని...

అప్పట్నుంచి అడగటం మానేసి ఆకాశం లాంటి అతని ఆలోచనా విశాలతని అర్ధం చేస్కోడం మొదలెట్టాను...

సేనాని మీరు చిందించిన ప్రతి చెమట బొట్టు రేపటితరం ఎక్కబోయే మార్గదర్శపు మెట్టు కాబోతుంది కూటమి రాబోతుంది...

సిరా పూసిన సామన్యుడి వేలి సంతకంతో ‘నీ గెలుపు సిద్దమైంది’... విజయీభవ...! అని నాగబాబు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది గమనించిన అభిమానులు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed