AP News:ఆ పార్టీ పై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-24 15:48:52.0  )
AP News:ఆ పార్టీ పై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: జనసేన నేత నాగబాబు ఏపీలో శాంతి భద్రతలకు సంబంధించిన సంచలన ఆరోపణలు చేశారు. ఓ పార్టీ గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉందంటూ ట్వీట్ చేశారు. ‘కూటమి ప్రభుత్వం తాలుకు పరిపాలన సజావుగా జరగకుండా ఉండడానికి, రాష్ట్రంలో అల్లర్లు, గొడవలు హింసాత్మక సంఘటనలు చేయడానికి ప్రతి జిల్లాకి 10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలానికి ఖర్చు పెట్టడానికి ఒక పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీరు జిల్లాకి పది కోట్ల చొప్పున 13 ఉమ్మడి జిల్లాలకి 130 కోట్లు అదే సంవత్సరానికి 1500 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బు సామన్యుల సంక్షేమానికి ఖర్చుపెడితే కొంతలో కొంతైనా మీ మీద సింపతీ వచ్చేది..కానీ ఇలా అల్లర్లు చేస్తే మధ్యంతర పరిపాలన వచ్చేస్తుందని అనుకునే పనికిమాలిన ఆలోచనలను మానుకోవాలని’ నాగబాబు హితవు పలికారు. మీ క్రూర వ్యవహారాలేవి మాదాక రావు అనుకోకండి, వీటిని ధీటుగా ఎదుర్కొంటాం కాకపోతే మీకు నేనిచ్చే ఒక మంచి సలహా ఏంటంటే ఆ హింసాత్మక చర్యలకి పెట్టే ఆ డబ్బుని పేదల కోసం, వారి పురోగతి కోసం పెడితే కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అయిన దక్కుతుందని నాగబాబు ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read More..

Breaking:ఈ నెల 26న ఢిల్లీకి సీఎం చంద్రబాబు..కారణం ఏంటంటే?

Advertisement

Next Story