‘రాష్ట్రపతి పాలన అనడానికి సిగ్గుండాలి’.. జగన్‌పై నాగబాబు తీవ్ర విమర్శలు

by Satheesh |   ( Updated:2024-07-21 15:21:58.0  )
‘రాష్ట్రపతి పాలన అనడానికి సిగ్గుండాలి’.. జగన్‌పై నాగబాబు తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు అదుపు తప్పాయని.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అలాంటిదేమి లేదని అబద్దాలు చెప్పారు. కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణంగా చిత్రీరించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. రాష్ట్రపతి పాలన విధించాలనడానికి జగన్‌కు సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇంతకంటే దిగజారకండి అని చెప్పి కొద్దీ ఆయన ఇంకా దిగజారుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాలని చమత్కరించారు. ఐదేండ్లు అధికారంలో ఉండి ఏమి చేయని వైసీపీ నేతలు.. కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే మొరగడం ప్రారంభించారని విమర్శించారు. మేం కనీసం ఆరు నెలలు అయినా ఆగి చూశామని.. కానీ వైసీపీ వాళ్లు నెల రోజులకే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో వచ్చే ఐదేళ్లలో ఏపీలో ప్రజాపాలన సాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Read More..

గర్భిణీకి నొప్పులు.. మూడు కిలోమీటర్లు మోసుకెళ్లిన 108 సిబ్బంది

Advertisement

Next Story

Most Viewed