- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీకి భారీ షాక్ .. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న ఎంపీటీసీలు, సర్పంచులు
దిశ, ఎమ్మిగనూరు: ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికే మళ్లీ సీటు ఇవ్వాలంటూ ఎమ్మిగనూరుకు చెందిన ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు డిమాండ్ చేశారు. ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి వయోభారం ఉన్నందున ఎమ్మెల్యే సీటును మరొకరికి కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నకేశవరెడ్డికి కచ్చితంగా ఎమ్మెల్యే సీటును ఇవ్వాలని, లేనిపక్షంలో తామంతా పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఎంపీపీ కేశన్న ,వైస్ ఎంపీపీ పోలయ్య, సర్పంచులు రంగస్వామి, ఎంకప్ప లక్ష్మన్న వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు ఎమ్మిగనూరులో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎర్రకోట చెన్నకేశవరెడ్డి విధేయుడుగా ఉన్నారని తెలిపారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో శాసనసభకు రాజీనామా చేశారని గుర్తు చేశారు. జిల్లాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అని తెలిపారు. 2024 ఎలక్షన్లలో చెన్నకేశవరెడ్డికి సీటు ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు స్పష్టంచేశారు.