- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఆంధ్రప్రదేశ్ వాసులకు MP రాహుల్ గాంధీ సంచలన హామీలు
దిశ, వెబ్‌డెస్క్: తన భారత్ జోడో యాత్రకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డే స్ఫూర్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గెలుపునూ కాంక్షిస్తూ రాహుల్ గాంధీ శనివారం కడపలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్ర చేసినప్పుడు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవచ్చని వైఎస్సార్ తనతో చెప్పారని ఈ సందర్భంగా రాహుల్ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికే కాదు.. దేశానకీ వైఎస్సార్ మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం, పేదల కోసం వైఎస్సార్ రాజకీయం చేశారని అన్నారు.
ఇప్పుడు ఆ రాజకీయం ఆంధ్రప్రదేశ్‌లో లేదని, ఏపీని బీజేపీ బీ టీమ్ నడిపిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని రాహుల్ అభివర్ణించారు. రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతమని ఆయన ఎప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. కానీ ఆయన వారసుడు సీఎం జగన్ మాత్రం బీజేపీని ప్రశ్నించడం లేదని.. ఎందుకంటే ఆయనపై అవినీతి కేసులు ఉన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ సంచలన హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని మాటిచ్చారు.