- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Skill Case: చంద్రబాబు అరెస్ట్.. బీజేపీ పాత్రపై ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ పాత్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పార్టీ అగ్రనేతలపై పలువురు రాజకీయ నాయకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఇందులో ఎవరినీ నమ్మించాల్సిన అవసరం తమకు లేదన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని ఎంపీ రెడ్డప్ప ముందు మాట్లాడి ఆ తర్వాత సర్దుకున్నారని విమర్శించారు. ఏపీలో జనసేన పార్టీతోనే తమకు పొత్తు ఉందని మరోసారి స్పష్టం చేశారు. సీపీఐ దిక్కుమాలిన పార్టీ అని..అవకాశం కోసం ఆ పార్టీ నేతలు ఎంత దిగజారైనా మాట్లాడతారని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.