అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటా: ఎంపీ సీఎం రమేశ్

by srinivas |
అనకాపల్లి ప్రజలకు రుణపడి ఉంటా: ఎంపీ సీఎం రమేశ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ఆ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు, 24 మంది కూటమి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా వారికి శాఖలు కేటాయించారు. అయితే కడపకు చెందిన సీఎం రమేశ్ అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఈయనకు కేంద్రమంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు కేంద్రమంత్రి పదవి వరించింది. ఈ మేరకు ఆయన పదవిని సైతం స్వీకరించారు. అయితే కేంద్రమంత్రి పదవి దక్కకపోయినా సీఎం రమేశ్ ఎలాంటి ఫీల్ కాలేదు. అనకాపల్లి ఎంపీగా గెలవడంతో ఆయన ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన గెలుపుపై సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి ప్రజలను తాను రుణ పడి ఉంటానని చెప్పారు. ఉత్తరాంధ్రలో బీజేపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఏపీ ప్రజలు చాలా తెలివైన వాళ్లని, సైలెంట్ ఓటింగ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారని సీఎం రమేశ్ విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed