- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీడియా ప్రతినిధులపై MP అవినాష్ రెడ్డి అనుచరుల దాడి
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు వీరంగం వేశారు. మీడియా ప్రతినిధులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. వాహనాలను ధ్వంసం చేశారు. వివేకానంద కేసులో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవినాష్ రెడ్డి కోఠిలోని సీబీఐ ఆఫీస్‌కు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే, తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉందని సీబీఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి పులివెందులకు బయలుదేరారు.
దీనిపై సీరియస్ అయిన సీబీఐ అధికారులు అతన్ని మార్గమధ్యంలో పట్టుకోవడానికి వాహనాల్లో బయలుదేరారు. అదే సమయంలో మీడియా ప్రతినిధులు కూడా వాహనాల్లో అనుసరించారు. అయితే, దారిలో మీడియా వాహనాలను అడ్డుకున్న అవినాష్ రెడ్డి అనుచరులు వాటిని ధ్వంసం చేశారు. సిబ్బందిని కొట్టారు. కెమెరా మెన్లను కొట్టి వారి చేతుల్లోని కెమెరాలను లాక్కొని పగులగొట్టారు. ఈ దాడుల్లో ఇద్దరు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి :
Chandrababu: మీడియా వాహనంపై దాడిని ఖండించిన చంద్రబాబు
మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు