సినిమా పాలిటిక్స్..! ఎన్నికల వేళ ఆ మూవీస్ రీ-రిలీజ్.. ఎందుకో తెలుసా..?

by Ramesh N |
సినిమా పాలిటిక్స్..! ఎన్నికల వేళ ఆ మూవీస్ రీ-రిలీజ్.. ఎందుకో తెలుసా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలైన వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో సినిమా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ తీసిన చిత్రం వ్యూహం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

గతంలో ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలు తాజాగా రీ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. దీంట్లోని రాజకీయ అంశాలు జనసేన పార్టీకి కలిసి వస్తాయని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మహేష్‌బాబు నటించిన భరత్ అనే నేను మూవీని ఫిబ్రవరి నెలాఖరులో రీ-రిలీజ్ చేయబోతున్నారని సమాచారం.

అయితే సీఎం జగన్‌ పార్టీ ఈ సినిమా క్రేజ్‌ను వాడుకోబొతున్నట్లు తెలిసింది. ఈ సినిమాతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా పాలిటిక్స్ ఆ పార్టీలకు ఎంత వరకు ప్లెస్ అవుతాయో ఎన్నికల వరకు వేచి చూడాలని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed