Google map:గూగుల్ మ్యాప్స్ తెచ్చిన తంటా..వరదలో చిక్కుకున్న తల్లీకొడుకు

by Jakkula Mamatha |
Google map:గూగుల్ మ్యాప్స్ తెచ్చిన తంటా..వరదలో చిక్కుకున్న తల్లీకొడుకు
X

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ఇక ప్రజెంట్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్(Google map) అంటే అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్ పుణ్యమాని తెలియని ప్రదేశాలకు వెళ్లడం కూడా సులువైంది. గమ్యం ఎంత దూరంలో ఉంది..అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే వివరాలతో ఎప్పటికప్పుడు లొకేషన్ చూస్తూ ఎంచక్కా గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. అయితే కొన్ని సార్లు ఈ గూగుల్ మ్యాప్స్ వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశాలు ఉంటాయి. వివరాల్లోకి వెళితే..గూగుల్ మ్యాప్స్(Google map) తప్పు చూపిస్తే చిక్కుల్లో పడతామని తాజాగా విజయవాడలో రూరల్‌లో జరిగిన ఘటన రుజువు చేస్తోంది.

గూగుల్ మ్యాప్(Google map) పెట్టుకుని కారులో బయలుదేరిన తల్లి కొడుకు వరదలో చిక్కుకుపోయారు. సావారగూడెం వద్ద వరదలో తల్లీకొడుకు చిక్కుకున్నారు. విజయవాడ రూరల్‌ నున్న గ్రామానికి చెందిన తల్లి రాజకుమారి, కొడుకు కైలే గౌతమ్‌లు గూగుల్ మ్యాప్(Google map) పెట్టుకుని కారులో గమ్యస్థానానికి(Destination) బయలుదేరారు. సావారగూడెం వద్దకు వచ్చేసరికి కారు వరద(Floods)లో చిక్కుకుపోయింది. మమ్మల్ని కాపాడండి అంటూ గన్నవరం తహసీల్దార్(Tehsildar) శివయ్యకు బాధితులు(victims) లొకేషన్ సెండ్ చేశారు. వెంటనే స్పందించిన శివయ్య ఎండీవో సత్య కుమార్, తమ రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న గ్రామ రెవెన్యూ సిబ్బంది, సావారగూడెం గ్రామస్తులు తల్లీకొడుకులు సురక్షితంగా వరద నుంచి బయటకు తీసుకొచ్చారు. బాధితులు(victims)..నున్న పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులుగా గుర్తించడం జరిగింది.

Advertisement

Next Story

Most Viewed