- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:అన్నదాతలను ఆదుకుంటాం..దెబ్బతిన్న పంటల పరిశీలన
దిశ,అమలాపురం:భారీ వర్షాలతో నష్టాల పాలైన రైతుల్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. శనివారం మండల కేంద్రమైన ఆలమూరు, పెనికేరు, మోదుకూరు, గుమ్మిలేరు గ్రామాల్లో ముంపునకు గురైన పంట పొలాలను ఆయన పరిశీలించారు. మోకాలి లోతులో నీరు నిలిచిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను తెలుసుకొని భరోసా అందించారు. ముంపు నీరు పంట పొలాల నుంచి బయటకు వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాన్ని వచ్చే శాసనసభ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకుని వెళ్తానని ఆయన అన్నారు. వర్షాల వల్ల వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది గనుక ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కాచిన నీటిని తాగడం, పరిశుభ్రత పాటించడం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.