- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైల్లోనే మెుద్దు శీను హత్య... చంద్రబాబు భద్రత పరిటాల సునీత ఆందోళన
దిశ, డైనమిక్ బ్యూరో : రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రత విషయంలో మాజీమంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై భయాందోళనలు ఉన్నాయని అన్నారు. అనంతపురం జిల్లాలో చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న పరిటాల సునీత జైల్లో చంద్రబాబుకు భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు గోడల ఎత్తు గురించి మాట్లాడుతున్నారని అంతేఎత్తులో ఉన్న అనంతపురం జిల్లా జైలులోనే మెుద్దు శీనును హత్య చేశారని పరిటాల సునీత గుర్తు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. జైల్లో అనేక మంది రకాల మనుషులు ఉంటారని చెప్పుకొచ్చారు. వారి వల్ల ప్రాణమాని ఉందన్న అనుమానాన్ని పరిటాల సునీత వ్యక్తం చేశారు. చంద్రబాబుపై కక్షతో నాలుగున్నరేళ్లుగా వైసీపీ వెంటాడుతోందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి ఆనందం పొందుతున్నారు అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. జగన్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే వరకు తమ పోరాటం ఆగదు అని మాజీమంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు.