- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:హంద్రీనీవాకు నీటి విడుదల..జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే
దిశ,నందికొట్కూరు:నియోజకవర్గం లోని మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సోమవారం నీటిని విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు హంద్రీనీవా పంపుహౌజ్‌లోని 7వ మోటార్ పంపుకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మకు జల హారతి ఇచ్చారు. 1,7 8,10,11 ఐదు పంపుల ద్వారా 1500 క్యూ.సె.ల నీటిని హంద్రీనీవా ప్రధాన కాలువకు విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ రైతులు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుక్షణం పరితపిస్తున్నామన్నారు.
మన ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని, 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా వానలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. ప్రతి నీటి బొట్టును రైతులు సద్వినియోగం చేసుకోవాలని, నీటిని సద్వినియోగం చేసుకునేటప్పుడు నీటి వృధాను అరికట్టే వచ్చన్నారు. వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఈఈ సురేష్ రెడ్డి, డిఈ చిన్నయ్య, ఏఈఈ మహీంద్రా రెడ్డి, జలవనరుల విద్యుత్ శాఖ డిఈ శాలిని, జేఈలు సరిత, ఉదయశ్రీ, టీడీపీ నాయకులు, రైతులు, బాల మద్దయ్య, అంజిబాబు, కృష్ణ, పాల గౌడు, లక్ష్మన్న, శ్రీనివాసులు, కమల్, అక్బర్, శంకర్ గౌడ్, నరసన్న గౌడ్, తదితరులు పాల్గొన్నారు.