- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YS jaganకు ఫిర్యాదు చేస్తా.. మంత్రి జోగి రమేశ్‌కు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వార్నింగ్
దిశ వెబ్ డెస్క్: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిశారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేశ్ జోక్యం అధికమైందని, అది తనకు ఇబ్బందులుకు గురి చేస్తోందని కృష్ణ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. తనను కొందరు టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తు్న్నారని, అయినప్పటికీ తాను వైసీపీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. చాడీలు చెప్పే మనస్తత్వం తనది కాదన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన నియోజకవర్గంలో జరుగుతున్న చికాకులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
కాగా మంత్రి జోగి రమేశ్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. పెడన నియోజకవర్గం వదిలేసి మైలవరం నుంచి పోటీ చేస్తే మంచిదని భావించిన మంత్రి జోగి రమేశ్ అందుకు తగిన విధంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తు్న్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని వసంత కృష్ణప్రసాద్ నిర్ణయించుకున్నారు.
Read more:
1.నా తండ్రి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు.. నేను Jagan వెన్నంటే ఉంటా..!
- Tags
- Andhra Pradesh