- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎమ్మెల్యే రాచమల్లు పెద్దమనసు: పేద విద్యార్థిని ఎంబీబీఎస్ కోసం రూ.50 లక్షలు సాయం

దిశ , డైనమిక్ బ్యూరో : ఓ నిరుపేద దళిత విద్యార్థినికి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కొండంత అండగా నిలిచారు. ఇప్పటికే ఎందరికో మంచిచేసిన ఎమ్మెల్యే ఆ విద్యార్థినిపట్ల తన మంచితనాన్ని చాటుకున్నారు. విద్యార్థిని ఎంబీబీఎస్ చదివించేందుకు అయ్యే ఖర్చు రూ.50 లక్షలు తానే భరిస్తానని వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరు పట్టణంలోని నిరుపేద ఎస్సీ విద్యార్థిని వాత్సల్యశ్రీ రష్యాలో ఎంబీబీఎస్ చదివేందుకు అయ్యే ఖర్చు రూ.50లక్షలు తానే భరిస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి విద్యార్థినికి పాస్ పోర్టు, వీసాను తెప్పించినట్లు తెలిపారు. పట్నం వాత్సల్యశ్రీకి ఎంబీబీఎస్ చదవాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందని అన్నారు. విద్యార్థిని కరాటేలో కూడా రాణించిందన్నారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని తనకు వివరించడంతో రూ.2లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించినట్లు తెలిపారు. రష్యా ఏషియన్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీబీఎస్ సీటు రావడంతో వాత్సల్యశ్రీ తనను కలిసిందని, తాను ఏమాత్రం ఆలోచించకుండా ఆరేళ్లు చదవడానికి అయ్యే ఖర్చు రూ.50లక్షలను భరిస్తానని వెల్లడించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తనకు కొత్త కాదని, ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తాను సాయం చేశానని ప్రకటించారు. ఎవరికై నా చదువే రాజమార్గమని పేర్కొన్నారు. మరోవైపు పట్నం వాత్సల్యశ్రీ మాట్లాడుతూ గాడ్ ఫాదర్ లాంటి ఎమ్మెల్యే రాచమల్లుతోనే డాక్టర్ వాత్యల్సశ్రీ అవుతానని అన్నారు. తన తండ్రి శ్రీనివాస్ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ఉంటూ గుండెపోటుతో మరణించాడని... ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు గురించి తెలుసుకుని సంప్రదించానన్నారు. పెద్ద మనసుతో స్పందించిన ఆయన తన చదువుకు సహకారం అందిస్తున్నారన్నారు. తన కుమార్తెను పెద్ద చదువులు చదివిస్తున్న ఎమ్మెల్యే రాచమల్లుకు విద్యార్థి వాత్సల్యశ్రీ తల్లి సునీత కృతజ్ఞతలు తెలిపారు.