- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తోబుట్టువుల క్షేమం రాఖీ పండుగ: బాలకృష్ణ
దిశ, ఏపీ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాలు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల అనురాగానికి చిహ్నం రాఖీ పర్వదినం. తోబుట్టువుల క్షేమం కోరే పండుగ, ఒకరికొకరు అండగా, ఆలంబనగా ఉంటూ తోబుట్టువులకు రక్షణగా నిలిచే పండుగ. అందుకే నందమూరి నాయకుల సినిమాలలో తోబుట్టువుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలనే సందేశం ఉంటుంది అని నందమూరి బాలకృష్ణ తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆడబిడ్డల సంక్షేమం కోసమే ''అన్న ఎన్టీఆర్'' తెలుగుదేశం పార్టీ నెలకొల్పింది. తండ్రి ఆస్తిలో ఆడబిడ్డలకు హక్కు కల్పించడం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, బాలికా విద్యకు ప్రోత్సాహం, ఉపాధికి పెద్దపీట, డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళా సాధికారత వంటివన్నీ ఆడబిడ్డల అభ్యున్నతి కోసమే. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా మహిళాభ్యున్నతికి పాటుబడటమే మనందరి కర్తవ్యం అని బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులందరికీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరుడైన జవానుకి రాఖీ కట్టిన సోదరి.. గుండె కరిగే దృశ్యం!
Raksha Bandhan: అక్క,చెల్లెమ్మలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు: సీఎం జగన్