Ycp Mla: ప్యాకేజీ స్టారే.. రా చెప్పుతో కొట్టు!

by srinivas |   ( Updated:2023-05-15 10:41:43.0  )
Ycp Mla: ప్యాకేజీ స్టారే.. రా చెప్పుతో కొట్టు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు నుంచి పవన్‌కి భారీగా ముడుపులు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్యాకేజీ స్టార్ అంటూ చెప్పుతో కొడతానని హెచ్చరించిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తాను బాహటంగా అంటున్నానని పవన్ ప్యాకేజీ స్టార్ అని చెప్పారు. దమ్ముంటే.. తనను చెప్పుతో కొట్టాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నుంచి పవన్ సూట్ కేసులు తీసుకున్నారని ఆరోపించారు. కోవూరు నడిరోడ్డులో నిలబడి పవన్ ప్యాకేజీ స్టార్ అంటానని దమ్ముంటే చెప్పుతో రావాలని.. తనను కొట్టాలని ఛాలెంజ్ చేశారు.

రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉందా అని ప్రసన్న కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి పవన్ కల్యాణ్ తన శీలాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నుంచి వందల కోట్లు తీసుకుంటున్నాడని విమర్శించారు. చంద్రబాబుని కలిసేందుకు వెళ్లేప్పుడు వెంట నాదెండ్ల మనోహర్‌ను కూడా తీసుకువెళ్తున్నాడంటే అక్కడే పవన్‌ కేవలం డబ్బుల కోసమే జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర పెట్టాడని అర్థమైపోతుందన్నారు. కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి మోహన రంగాని చంపించింది చంద్రబాబు నాయుడు కాదా అని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిలదీశారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పవన్ కల్యాణ్ చెడపుట్టారంటూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టారని.. హుందాగా రాజకీయం చేశారని.. ఆ హుందాతనం పవన్ కల్యాణ్‌లో కనిపించడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి మోహన రంగాను చంపిన చంద్రబాబుకు జనసేన పార్టీని 25 కోట్లకు అమ్మేసి సీఎం జగన్‌ను దించేందుకు పొత్తులు పెట్టుకుంటావా అని నిలదీశారు. చంద్రబాబుకు దాసోహం అయిన పవన్ కల్యాణ్‌ను అటు జనసైనికులు ఇటు ప్రజలు క్షమించరని విమర్శించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలిసినా దేశంలోని ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఎవరూ.. ఏమీ పీకలేరని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హెచ్చరించారు.

Read more:

NTR Satha Jayanthi Celebrations: నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Amaravati Scam: ఊపందుకున్న దర్యాప్తు.. చంద్రబాబు కరకట్ట ఇల్లు జప్తు

Advertisement

Next Story