- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహ్వానించడానికి ఎవరింట్లో పెళ్లికాదు.. వైసీపీ కార్పొరేటర్‌పై కడప ఎమ్మెల్యే సీరియస్
దిశ, వెబ్ డెస్క్: కడప సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్సెస్ కార్పొరేటర్ ఉమాదేవిగా మారింది. పెన్షన్ల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 49వ డివిజన్‌లో పింఛన్ల పంపిణీ చేశారని, అయితే తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కార్పొరేటర్ ఉమాదేవి నిలదీశారు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి తన కార్పొరేషన్‌లో ఎలా పింఛన్లు ఇస్తారని ప్రశ్నించారు. ఆ డివిజన్‌లో గెలిచిన తమను ఆహ్వానించలేదని మండిపడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. కార్పొరేషన్‌ను తమరు కొన్నారా, మీ పేరుపై రాయించుకున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఎవరైనా రావొచ్చని చెప్పారు. 50 డివిజన్లున్న కడప కార్పొరేషన్‌లో తమరు తప్ప పింఛన్ల పంపిణీలో అందరూ వచ్చారన్నారు. ఎవరిని ఆహ్వానించలేదని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలతో తాము సైతం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. శ్రద్ధ ఉంటే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనవచ్చని చెప్పారు. ఎవరింట్లో పెళ్లి కాదని, కార్డు ఇచ్చి పిలవడానికి అని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.