- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీలోకి సునీత.. వ్యతిరేకిస్తున్న శిరీషా
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తూ ఇవాళ సీఎం జగన్‌ను లేఖ రాశారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పోతుల సునీత తెలిపారు. అయితే పోతుల సునీత గతంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. దీంతో ఇప్పుడు కూడా ఆమె తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పలాస ఎమ్మెల్యే గౌర శిరీషా స్పందించారు. టీడీపీలో పోతుల సునీత చేరికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పోతుల సునీతను టీడీపీలో చేర్చుకోవద్దన్నారు. పోతుల సునీత ఊసరవెళ్లి రాజకీయలు చేస్తారని మండిపడ్డారు. పదవుల కోసం అధికార పార్టీలో చేరతారని విమర్శించారు. పార్టీ అధికారం కోల్పోతే ఆ పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రాజకీయాలు చేసే పోతుల సునీతను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలో చేర్చుకోవద్దన్నారు. పదవుల కోసం వచ్చే సునీతను పార్టీలో చేర్చుకుంటే అధికారం లేని సమయంలో పోరాటం చేసిన నాయకులను అవమానించినట్టేనని గౌతు శిరీషా పేర్కొన్నారు.