- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్‌గా హిందూపురం.. ఎమ్మెల్యే బాలయ్య కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్‌గా హిందూపురాన్ని ప్రకటించాలన్న ప్రజల డిమాండ్‌పై ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేది ప్రజల చిరకాల వాంఛ అని గతంలోనే బాలయ్య చెప్పారు. తప్పకుండా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా సాధిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బాలయ్య సైతం డిమాండ్ చేశారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో ఆయన స్పందించారు.. హిందూపురంలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ముందు బాలయ్య మాట్లాడుతూ సత్యసాయి జిల్లా పేరులో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేయాలని కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని బాలయ్య స్పష్టం చేశారు.
కాగా సీఎంగా జగన్ ఉన్న సమయంలో ఏపీ జిల్లాలను విభజన చేశారు. 10 జిల్లాలను 26గా పునర్విభజన చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పునర్విభజనలో భాగంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించారు. అయితే హిందూపురం వాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లాకు హెడ్ క్వార్టర్‌గా హిందూపురాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే బాలయ్య సైతం ప్రజల డిమాండ్‌కు మద్దతు తెలిపారు.