- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళలంటే పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదు.. మంత్రి ఉషాశ్రీచరణ్
దిశ, కళ్యాణదుర్గం: మహిళలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గౌరవం లేదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. వాలంటీర్లను కించపరిచేలా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉషాశ్రీచరణ్ ఖండించారు. సీఎం జగనన్న ప్రవేశ పెట్టిన సచివాలయ వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇతర దేశాల ప్రతినిధులు మన వాలంటీర్ వ్యవస్థ పనితీరును పరిశీలించి వారి దేశంలో అమలు చేసేందుకు కసరత్తు చేసుకుంటున్నారన్నారు. ఇంతటి బాధ్యతాయుతమైన వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.
రాజకీయాలకు అతీతంగా కుల, మతాలు తేడా లేకుండా పథకాలను గడప గడపకూ అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుట్ర పన్నారన్నారు. పవన్ కళ్యాణ్ ను చూడగానే ఆడపిల్లలు భయపడే పరిస్థితి ఉందన్నారు. వాలంటీర్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.