- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: కడప అధికారులపై మంత్రి సవిత సీరియస్.. సంచలన ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: కడప అధికారుల(Kadapa Authorities)పై మంత్రి సవిత(Minister Savita) సీరియస్ అయ్యారు. కడప రిమ్స్(Kadapa Rims)లో సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu) పర్యటించారు. అయితే ఈ కార్యక్రమంలో అధికారులు పాటించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రిమ్స్ ఘటనలో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను మంత్రి సవిత ఆదేశించారు. కడప జిల్లాలో ప్రత్యేక రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.
సీఎం, మాజీ ఉపరాష్ట్రపతి పర్యటనలో కూడా ప్రొటోకాల్ పాటించకపోవడం సరికాదని మంత్రి సవిత అసహనం వ్యక్తం చేశారు. కడప డీఆర్సీ సమావేశంలో అధికారులతో భేటీ అయిన ఆమె కొందరు అధికారులు నీతి, నిజాయితో పని చేస్తుంటే మరికొందరు మాత్రం రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులపై గన్ పెట్టి బెదిరించి పనులు చేయించుకున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు చేస్తున్న మంచి పాలనకు అందరూ సహకరించాలని అధికారులను మంత్రి సవిత విజ్ఞప్తి చేశారు.