అందుకే డయేరియా విజృంభించింది.. ప్రజారోగ్యంపై మంత్రి సత్యకుమార్ ఫైర్

by Y.Nagarani |
అందుకే డయేరియా విజృంభించింది.. ప్రజారోగ్యంపై మంత్రి సత్యకుమార్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజారోగ్యంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైరయ్యారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తుంటే.. ప్రతిపక్షం వాటిపై ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు. గత పాలకులు పైప్ లైన్లను సరిగ్గా వేయకపోవడంతో.. లీకేజీలు జరిగి మంచినీరు కలుషితమవుతుందని, అందుకే డయేరియా ఈ స్థాయిలో విజృంభించి ప్రజలను పొట్టన పెట్టుకుందన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలకు కేంద్రం ఇచ్చిన నాబార్డు నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులన్నింటినీ దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న కలను నాశనం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఉన్న మెడికల్ కాలేజీలోనే 48 శాతం ఫ్యాకల్టీ ఉందని నేషనల్ మెడికల్ కౌన్సిల్ చెప్పిందని, పెనాల్టీ కూడా వేసిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వ పాలనలో కల్తీ మద్యం తాగి.. మూత్రపిండాలు, కాలేయం వ్యాధులతో చాలామంది ప్రజలు సతమవుతున్నారని మంత్రి సత్యకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story