RK Roja: చంద్రబాబును ఆయన కూడా తరిమేస్తారు..

by srinivas |   ( Updated:2023-09-05 10:35:24.0  )
RK Roja: చంద్రబాబును ఆయన కూడా తరిమేస్తారు..
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబును త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తరిమేస్తారని మంత్రి రోజా జోస్యం చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ అవినీతిపై ఈడీ, సీబీఐతో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీచర్చ్ డే వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ గురువుల్లోనే అత్యంత కళంకితుడు మాజీ మంత్రి నారాయణ అని ఆరోపించారు. స్కూళ్లు, కాలేజీల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు రాజకీయ గురువని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు నేర్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అమరావతి రాజధాని బినామీ అని రోజా ఆరోపించారు. కలెక్షన్ కింగ్ చంద్రబాబు అని రోజా విమర్శించారు. ఏపీని చంద్రబాబు దోచుకుని హైదరాబాద్‌లో ఉంటున్నారని, రెండు ఎకరాలు ఉన్న ఆయన వేల కోట్లు ఎలా సంపాదించారని మంత్రి రోజా ప్రశ్నించారు.

Advertisement

Next Story