Minister Ramprasad: ఆస్పత్రిలో హడలెత్తించిన మంత్రి రాంప్రసాద్

by srinivas |   ( Updated:2024-08-02 11:23:43.0  )
Minister Ramprasad: ఆస్పత్రిలో హడలెత్తించిన మంత్రి రాంప్రసాద్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి రాంప్రసాద్ రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో అందరినీ హడలెత్తించారు. ఆకస్మాత్తుగా తనిఖీలకు వెళ్లారు. వార్డులు, ఆపరేషన్ థియేటర్‌తో పాటు వైద్య పరికరాలకు పరిశీలించారు. ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల భవనంలో నాసిరకం పనులు జరుగుతున్నట్లు గుర్తించారు. నాసిరకం పనులు ఎందుకు చేస్తున్నారంటూ కాంట్రాక్టర్‌పై మండిపడ్డారు. నిర్మాణ పనుల్లో వెంటనే నాణ్యత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లో 100 పడకల ఆస్పత్రికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు నాసిరకంగా ఉంటే సహించమని, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని, మరో సారి పునరావృతం చేయొద్దని మంత్రి హెచ్చరించారు.

Next Story