పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచిన మంత్రి నారాయణ

by Mahesh |   ( Updated:2024-11-04 11:10:39.0  )
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచిన మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్: పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాష్ట్రంలో జరుగుతున్న.. వరుసు ఘటనలపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అత్యాచారాలకు పాల్పడిన కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో కులం అడ్డొస్తోంది అని ప్రశ్నించారు. అలాగే నిందితుల్లో తమ బంధువులున్నా సరే.. వాళ్లని మడతపెట్టి కొట్టాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలపై హోంమంత్రి అనిత (Home Minister Anita) బాధ్యత వహించాలన్నారు. హోంశాఖ కూడా తానే తీసుకోవాల్సిందన్న పవన్.. తానే హోంమంత్రిని అయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని, అధికారంలో ఉన్నాం కాబట్టే సైలెంట్‌గా ఉంటున్నామని, లేదంటే తామేంటో చూపించేవారమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి నారాయణ(Minister Narayana) స్పందించారు. సీఎం, డిప్యూటీ సీఎంకు పోర్ట్‌ ఫోలియోలపై.. స్పందించే స్వేచ్ఛ ఉంటుందని.. ఆయన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ మద్దతుగా నిలిచారు. అలాగే డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను మంత్రులు అందరూ అలర్ట్‌గా తీసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు(CM chandrababu) అందరినీ కో-ఆర్డినేట్‌ చేయగలరు ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Read more : రాష్ట్రంలో మహిళలపై పెరుగుతోన్న దారుణాలు....హోంమంత్రి అనితపై పవన్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed