Minister: వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది

by Gantepaka Srikanth |
Minister: వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడింది
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని వరద(Flood) ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం మంత్రి నారాయణ(Minister Narayana) పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సదర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. మళ్లీ వరద అంటూ కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన దక్షత చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుందని అన్నారు. విషప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క రోజు కాదు.. రెండ్రోజులు కాదు.. ఏకంగా రెండు వారాల పాటు వరద బాధితులతో పాటే సీఎం చంద్రబాబు జీవించారని అన్నారు. నిత్యం పరిస్థితిని సమీక్షించారని తెలిపారు. ఆయన ముందుచూపుతోనే పరిస్థితి చాలా వరకు అదుపు చేయగలిగామని అన్నారు. విపత్తు నుండి ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టెక్కించారు.

Advertisement

Next Story

Most Viewed