Amaravati : రాజధానిలో భారీగా డ్యామేజ్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-06-19 14:02:57.0  )
Amaravati : రాజధానిలో భారీగా డ్యామేజ్.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: గత ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో భారీగా డ్యామేజ్ జరిగిందని, త్వరలో కమిటీలు వేసి పరిశీలిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఘటనలపై ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు తెలిపారు. కమిటీలు వేసి రాజధానిలో డ్యామేజ్‌ను పరిశీలిస్తామన్నారు. పనులు చేపట్టేందుకు కేబినెట్‌లో చర్చించాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజధానిలో సామాగ్రిని కొందరు చోరీ చేశారని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజధానిలో టెండర్లకు కాలపరిమితి ముగిసిందని చెప్పారు. కొత్తగా అంచనాలు రెడీ చేసి టెండర్లు పిలవాలని, మరో 4 నెలలు సమయం పడుతుందని మంత్రి నారాయణ తెలిపారు.

ఇక రాజధాని ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయంపైనా మంత్రి నారాయణ స్పందించారు. ప్రస్తుతం ఆ అంశం సుప్రీంకోర్టులో పరిధిలో ఉందన్నారు. తీర్పు వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం న్యాయ సలహా తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed